వట సావిత్రి వ్రతం

వట సావిత్రి వ్రతం
వట సావిత్రి వ్రతం ఆచరించటం వలన స్త్రీలు కలకాలం సుమంగళిగా ఉంటారని పురాణ కథనం. ఈ వ్రతాన్ని జ్యేష్ఠ పూర్ణిమ నాడు ఆచరించాలని స్కంద, భవిష్యోత్తర పురాణాలు చెపితే, అమావాస్య రోజు ఆచరించాలని నిర్ణయ సింధు చెబుతోంది. సతీసావిత్రి  యముడితో పోరాడి, తన భర్త ప్రాణాలను తిరిగి తెచ్చుకున్న రోజును వటసావిత్రివ్రతంగా ఆచరిస్తారు.

వట సావిత్రి వ్రతాన్ని ఆచరించేవారు ఉదయమే నిద్ర లేచి మఱ్ఱిచెట్టు వద్ద శుభ్రపరిచి అక్కడ ముగ్గులు వేయాలి. అక్కడ సావిత్రి, సత్యవంతుల విగ్రహాలను గానీ, చిత్రపటాలను గానీ, లేదా పసుపు ముద్దలను గానీ నెలకొల్పాలి. ఆ వట వృక్షాన్ని (మఱ్ఱి చెట్టును) పసుపు, కుంకుమలతో పూజించాలి. అనంతరం దారానికి పసుపు/కుంకుమ  పూసి, ఆ దారాన్ని మఱ్ఱి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ దానికి చుట్టాలి. ఇలా 108 ప్రదక్షిణాలు చేసి 108 చుట్లు చుట్టాలి. ఈ దారం యమధర్మ రాజు పాశం కంటే పొడవై, యమునితో ఐదవతనం కోసం పోరాడేందుకు చిహ్నంగా నిలుస్తుందని భావిస్తారు. 

వట వృక్షానికి అర్ఘ్యం ఇచ్చేప్పుడు, 

'అవైధవ్యం చ సౌభాగ్యం దేహిత్వం మమ సువ్రతే 
పుత్రాన్ పౌత్రాన్ చ సౌఖ్యం చ గృహాణార్ఘ్యం నమోస్తుతే' అని స్తుతించాలి. 

వట సించామి తే మూలం సలిలై రమృతోపమై 
యథా శాఖోపశాఖా భిర్వర్  ద్దొసి త్వం మహీతలే | 
తథా పుత్రైచ్ఛ పౌత్రైచ్ఛ సమ్పన్నం కురుమాన్ సదా||  అంటూ వట వృక్షానికి నమస్కరించాలి. 

సాయంత్ర సమయంలో కనీసం ఐదుగురు ముత్తైదువులకు పసుపు, కుంకుమ, తాంబూలం మరియు మామిడిపండ్లను ఇస్తారు. ఈ వ్రతంలో "మమ వైధవ్యాది సకల దోష పరిహారార్ధం బ్రహ్మసావిత్రీ ప్రీత్యర్థం సత్యవత్సావిత్రీ ప్రీత్యర్థంచ వటసావిత్రీవ్రతమహం కరిష్యే" అని సంకల్పం చెప్పుకుంటారు. ఈ  రోజు సావిత్రి, సత్యవంతుల కథను వినడం కానీ, చదవడం గానీ చేయడం శుభప్రదమని భావిస్తారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post