తెలుగులో సుడిగాడు, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి సినిమాల్లో అల్లరి నరేశ్‌తో కలిసి నటించిన మోనాల్ గజ్జర్ తాను బతికే ఉన్నానని ఫేస్ బుక్ లైవ్ లో స్పష్టం చేసారు.
తన మిత్రుని పుట్టిన రోజు వేడుకలు జరుపుకునేందుకు తన ఇతర మిత్రులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి అహ్మదాబాద్ నుంచి ఉదయ్ పూర్ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఉదయ్ పూర్ హైవేపై వారు ప్రయాణిస్తున్న కారుకు గత ఆదివారం ఆక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనలో మోనాల్ మృతిచెందినట్టు వార్తలు రావడంతో ఆమె బుధవారం ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చారు. తాను మరణించానని కొన్ని మీడియాల్లో వచ్చిన వార్తలను ఆమే స్వయంగా ఖండించారు. తన మెడ బెణికిందని బెల్టు ధరిస్తున్నానని అన్నారు. కాగా, ఈ ఘటనలో కారు పూర్తిగా పాడైపోయింది.
Post a Comment