తమిళ నటి ఆత్మహత్య

ప్రముఖ తమిళ టెలివిజన్ నటి ప్రియాంక ఆత్మహత్య చేసుకున్నారు. వంశం సీరియల్ లో రమ్యకృష్ణ సరసన చేసిన జోతిక పాత్ర ఆమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఆమె కొన్ని తమిళ చిత్రాలలోనూ కనిపించింది. ఆమె తెల్లవారుఝామున వ‌ల‌స‌ర‌వ‌క్కంలోని తన ఇంట్లో సీలింగ్‌కు వురి వేసుకుంది. ఉదయం పనిమనిషి వచ్చి చూసిన వెంటనే పోలీసులకు రిపోర్టు చేసింది. వారు కేసు ఫైల్ చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

కుటుంబ కలహాలతోనే ప్రియాంక ఈ పని చేసి ఉంటుందని భావిస్తున్నారు. మూడు సంవత్సరాల క్రితం ఆమెకు అరుణ్ బాల అనే వ్యక్తితో వివాహమైంది. మనస్పర్థల కారణంగా గత మూడు నెలల నుండి వారు వేరుగా ఉంటున్నారు. ఈ జంటకు ఇంకా పిల్లలు లేరు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post