అవిశ్వాసానికి ఎంఐఎం మద్ధతు, స్పందించని టిఆర్ఎస్

అవిశ్వాసానికి ఎంఐఎం మద్ధతు, స్పందించని టిఆర్ఎస్
అనుకున్న విధంగానే ఇవాళ టిడిపి ఎంపీ కేశినేని నాని ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదం తెలిపారు.  టిడిపి ఎంపీలతో పాటు కాంగ్రెస్ నుండి కూడా అవిశ్వాస తీర్మానం నోటీసులు అందాయి. ఈ సందర్భంగా తీర్మానాన్ని సమర్థించేవారు లేచి నిలబడాలని స్పీకర్ కోరగా టిడిపి, కాంగ్రెస్ ఎంపీలతో పాటు సీపీఐ, సీపీఎం, ఆర్ఎస్పీ, ఆమ్ ఆద్మీ, సమాజ్ వాదీ, ఎన్సీపీ, టీఎంసీ, మరియు ఆర్జేడీ పార్టీల  ఎంపీలు లేచి నిలబడ్డారు. ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా లేచి నిలబడ్డారు. కానీ టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు స్పందించలేదు. 

యాభయ్ మందికి పైగా సభ్యులు మద్ధతు తెలిపారని, త్వరలో చర్చ తేదీని నిర్ణయిస్తానని స్పీకర్ తెలుపగా, 10 రోజుల నిబంధనను టీఎంసీ సభ్యుడు సౌగత్ రాయ్ ప్రస్తావించారు. అతిపెద్ద ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని పక్కన బెట్టి టిడిపి ప్రతిపాదించిన అవిశ్వాసాన్ని ఆమోదించినందుకు అభ్యంతరం తెలిపారు. ముందుగా ఇచ్చిన నోటీసు పై స్పందించామని స్పీకర్ తెలిపారు. 

టిఆర్ఎస్ ఎంపీలు మాట్లాడుతూ కెసిఆర్ నుండి ఆదేశాలు అందిన తర్వాత  అవిశ్వాసం విషయంలో ఆలోచిస్తామని తెలిపారు. కాగా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందటంతో అవిశ్వాసం పై జరిగే చర్చలో ప్రత్యేక హోదాపై మాట్లాడే మంచి అవకాశాన్ని కోల్పోయినట్లయింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post