జమిలి ఎన్నికలకు మేము సిద్ధమే

జమిలి ఎన్నికలకు మేము సిద్ధమే
దేశవ్యాప్తంగా అన్ని పార్లమెంట్ మరియు అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు తాము అనుకూలమని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ కుమార్ తెలియ చేసారు. జమిలి ఎన్నికలపై లా కమిషన్‌కు ఈ విషయాన్ని తమ పార్టీ అభిప్రాయంగా స్పష్టం చేసి, సీఎం కేసీఆర్ లేఖ‌ను వారికి అందించామని తెలిపారు. 2019 నుంచి జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు తెరాస అనుకూలంగా ఉందని ఆయన అన్నారు. 

జమిలి ఎన్నికలపై చర్చ, ఇప్పుడు మోడీ ప్రభుత్వం మొదలు పెట్టింది కాదనీ, 1986 నుంచీ లా కమిషన్‌ ఇదే అంశంపై అనేక చర్చలు జరిపిందని ఆయన అన్నారు. ఈ విధానంతో ఒకే సారి ఎన్నికలు జరిగితే ఐదేళ్ల పాటు కేంద్ర, రాష్ట్రాల పాలన కు ఎటువంటి అడ్డంకులూ ఉండవని, ప్రభుత్వాలు ఎన్నికల ఆలోచనలు స్వేచ్ఛగా పనిచేసే అవకాశం ఉంటుందని చెప్పారు. వీటిద్వారా డబ్బు, సమయం ఆదా అవుతాయని కూడా కమిషన్‌కు వివరించామని వినోద్ కుమార్ తెలిపారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post