హరితహారం లో ఈత చెట్లు

హరితహారం లో ఈత చెట్లు
రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణకు హరిత హారం (THH) , నాలుగవ దశలో భాగంగా భారీ సంఖ్యలో ఈత (Phoenix Sylvestris) చెట్లను పెంచడాన్ని లక్ష్యంగా అటవీ శాఖ నిర్ణయించింది.

రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, కాలువలు మరియు ఇతర నీటి వనరుల గట్ల పై ఈ ఈత మొక్కలను పెంచాలని ర్రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనివలన పచ్చదనం మెరుగుపడటంతో పాటు వీటినుండి లభించే కల్లుతో నకిలీ మద్యం అరికట్టవచ్చునని, కొంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని కూడా ప్రభుత్వం ఆశిస్తోంది. 

కొన్ని జిల్లాల్లో తగినన్ని నీటి వనరులు, ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోవటం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా లక్ష్యం చేరగలమని అటవీ శాఖ ఆశిస్తోంది. ఎక్సయిజ్ శాఖ కూడా ఈత మొక్కల పెంపకానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తోంది. 

ముఖ్యమంత్రి కెసిఆర్, తెలంగాణకు హరిత హారం పథకం కింద నాలుగో విడతలో రాష్ట్రం మొత్తం మీద 100 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. తెలంగాణాలో ఇప్పుడున్న 24 శాతం పచ్చదనాన్ని 33 శాతానికి పెంచటమే ఈ పథకం దీర్ఘ కాలిక లక్ష్యం.  ఈ సంవత్సరం దీనిలో పండ్ల మొక్కలకు, ఈత మొక్కలకు ప్రాధాన్యతనిస్తున్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post