చిదంబరం ఇంట్లో దోపిడీ

చిదంబరం ఇంట్లో దోపిడీ
చెన్నైలో సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం ఇంట్లో దొంగలు పడి ఆభరణాలు, 1.5 లక్షల రూపాయల నగదు, ఆరు చీరలు దొంగిలించారని పోలీసులు తెలిపారు. చిదంబరం ప్రస్తుతం ఢిల్లీ లోనే ఉంటున్నారు. ఆయన భార్య ఒక నెల పాటు ఊటీ వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత ఈ సంఘటన జరిగినట్లు గుర్తించారు. 

సిసిటీవీ ఫుటేజీ ని పరిశీలించగా ఇద్దరు ఆడవాళ్లు ముసుగులు ధరించి ఈ దోపిడీకి పాల్పడినట్లు తెలిసింది. వీరిని గతంలో ఈ ఇంటిలో పని చేసిన వారిగా అనుమానిస్తున్నారు. వేలి ముద్రలు సేకరిస్తున్నామని నిందితులను తొందరలోనే పట్టుకుంటామని పోలీసులు అన్నారు. ఫిర్యాదు దాఖలయిందని దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post