జగన్, పవన్ లపై లోకేష్ ట్విట్టర్ విమర్శలు

జగన్, పవన్ లపై లోకేష్ ట్విట్టర్ విమర్శలు
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్‌ నాయుడు మళ్ళీ ట్విట్టర్లో ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ లపై తీవ్ర విమర్శలు చేసారు.

ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇళ్లపై జగన్ రాద్ధాంతం చేస్తున్నారని వరుస ట్వీట్లు చేసారు.పవన్ కళ్యాణ్ పై కూడా వరుస ట్వీట్లు చేస్తూ విచిత్రంగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంలో నాలుగేళ్లు భాగస్వాములైన తామే కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడామని, ప్రతిపక్ష పార్టీలు కేవలం మాటవరుసకే కేంద్రాన్ని వ్యతిరేకిస్తున్నాయని అన్నారు.  ఉత్తరాంధ్ర విషయానికి వస్తే హుద్ హుద్ తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు బస్సులోనే ఉండి ప్రజల కోసం సేవ చేసారని, ఈ విషయం వైజాగ్ ప్రజలు మర్చిపోరని అన్నాడు.

తమ పాలనలో ఉత్తరాంధ్ర ఎంతో అభివృద్ధి చెందిందని, ఎన్నో ఉద్యోగాలు కల్పించామని, పవన్ అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్నారని లోకేష్ అన్నారు. మీరు చేపడుతున్న ఇటువంటి పోరాట రాజకీయాల వల్ల అభివృద్ధి ఆగిపోదని ఆశిస్తున్నానన్నారు.


0/Post a Comment/Comments

Previous Post Next Post