థాయ్ గుహలో చిక్కుకున్న బాలురు సేఫ్

థాయ్ గుహలో చిక్కుకున్న బాలురు సేఫ్
థాయ్‌లాండ్‌లోని గుహలో పది రోజుల పాటు చిక్కుకుపోయిన పన్నెండు మంది బాలుర కథ సుఖాంతమైంది.  హాలీవుడ్‌ మూవీ ని తలపించిన  సంఘటనపై ప్రపంచం ఉత్కంఠతో ఎదురుచూసింది.  

ఫుట్ బాల్ ప్రాక్టీస్ ముగిసాక 11 నుంచి 16 ఏళ్ల వయసున్న ఈ బాలురంతా థామ్ లుయాంగ్ గుహలకు వెళ్లారు. వీరు లోపలికి వెళ్లిన అనంతరం  భారీ వర్షాలు మొదలవటం తో బయటకు వచ్చే మార్గం మూసుకుపోయి వారంతా అక్కడే చిక్కుకున్నట్టు అధికారులు భావించారు. 

వీరి ఆచూకీ కోసం సహాయక  సిబ్బంది ఆ గుహలను జల్లెడ పట్టారు. భారీ వర్షాల కారణంగా వాతావరణం కూడా సహకరించక పోవటంతో వెతకడం కష్టమైంది. దీనితో థాయ్‌ నావికాదళం కమాండో సీల్స్‌ కూడా రంగంలోకి దిగారు. అదృష్టవశాత్తు ఆదివారం నుండి వాతావరణం కొంత అనుకూలించింది. గుహలో వేరు వేరు మార్గాలు ఉండటం కూడా సహాయక సిబ్బందిని కలవర పరిచింది. 

సహాయక చర్యలు ముమ్మరం చేయటంతో ఎట్టకేలకు సోమవారం రాత్రి బ్రిటిష్ డైవర్లు, పిల్లల ఆచూకీ కనిపెట్టగలిగారు.  మొత్తం 13 మంది జీవించి ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అదృష్టవశాత్తు చిక్కుకుపోయిన గుహలో మంచి నీరు లభించటంతో వారు బతికి ఉన్నారని, అయితే వారు శారీరకంగా, మానసికంగా బలహీనంగా మారారని, విపరీతమైన ఆకలితో బాధ పడుతున్నారని వైద్యులు తెలిపారు. వారిని బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు ఇంకా జరుగుతున్నాయి. 

0/Post a Comment/Comments

Previous Post Next Post