శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వివాదాస్పద సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ను ఈ ఉదయం బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిందూ సంఘాలు ఆయనపై ఫిర్యాదు చేయడంతో ఆయనను అరెస్ట్ చేసినట్లు బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాస్ తెలిపారు. ఒక గంటపాటు విచారించి, నోటీసు ఇచ్చి ఇంటికి పంపారు. అవసరమైనప్పుడు వచ్చి విచారణకు సహకరించాలని కోరారు.
కత్తి మహేష్ రెండురోజుల క్రితం బంజారాహిల్స్‌లోని ఓ టీవీ ఛానెల్ చర్చావేదికలో శ్రీరాముడిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. దీనితో వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ శ్రేణులు ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
Post a Comment