అవే లీకులు.. ఆ పత్రికలది మళ్ళీ అదే తీరు

అవే లీకులు.. ఆ పత్రికలది మళ్ళీ అదే తీరు
ఇవాళ రెండు ప్రముఖ తెలుగు వార్తా పత్రికలలో ప్రముఖంగా కొన్ని వార్తలు అచ్చయ్యాయి. అయితే ఈ వార్తలు వీడియో కాన్ఫరెన్సులో చంద్రబాబు నాయుడు ఎంపీలకు దిశా నిర్దేశం చేస్తూ వ్యాఖ్యానించినవట. ఇవి అధికారిక వార్తలు కావు. కేవలం ఆ పత్రికలు కష్టపడి సంపాదించిన లీకు వార్తలు. 

బిజెపికి పార్లమెంట్లో మెజారిటీ ఉందని తలబిరుసుతనంతో, లెక్కలేనితనంతో వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.  విభజనకు ముందు, ఆ సమయంలో, తర్వాత కూడా రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ప్రజల మనోభావాలతో కేంద్రం ఆదుకోవడం మంచిది కాదు అని హెచ్చరించారు. ఎంపీలు బాగా పోరాడుతున్నారని ప్రశంసించి మరింత పోరాడాల్సిందిగా వారికి చెప్పి, దిశా నిర్దేశం చేసారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని బాగా నిలదీశారని వారిని కూడా ప్రశంసించారు. రాజ్య సభలో లో జరిగిన చర్చ తరువాత ఆంధ్ర ప్రదేశ్ ప్రజల్లో వారిపై వ్యతిరేకత తగ్గిందని కూడా కితాబిచ్చారు. 

ఇది ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్‌కు సంబంధించిన విషయమని పేర్కొంటూ,  అధికారంలోకి రాగానే విధానాలు మారిపోతాయా అని విస్మయం వ్యక్తం చేశారు. 

ఇది ఆ వార్తా సారాంశం. ఇలాంటి వార్తలే గత కొన్ని రోజులుగా వేర్వేరు రూపాలలో మనకు అక్కడ కనిపిస్తున్నాయి. ఇవి ఇలా వచ్చే ఎన్నికల వరకు ప్రజల మనసుల్లో నాటుకునేలా కొనసాగుతాయి. దీన్ని ఇలా అందించటంలో ఆ పత్రికలకు ఎన్నో ఉద్దేశ్యాలు ఉన్నాయి. 

ఇప్పుడు బిజెపితో పొత్తు లేదు కాబట్టి ఆ పార్టీపై వ్యతిరేకత పెంచాలి. చంద్రబాబు ఇన్నాళ్లు బిజెపితో అధికారం పంచుకున్నాడన్న విషయం మర్చిపోయి, ఆ రెండు పార్టీలు బద్ద శత్రువులని ప్రజలు భావించాలి. పార్లమెంట్లో ఎంపీలు ఇన్నాళ్లు ప్యాకేజీని మెచ్చుకున్న విషయం కప్పిపుచ్చి ఎంతో పోరాడుతున్నారని కూడా భావించాలి. అలాగే కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకతను కూడా తగ్గించాలి. 

చంద్రబాబు ఇక్కడ ప్రతిపక్షాల మాటలకు ఎంతో విలువ ఇచ్చిన వాడిలా కేంద్రానిది తలబిరుసుతనం అని అనటం,  అసలు ఎప్పుడూ మాట ఎప్పుడూ మార్చనట్టు, చంద్రబాబు  విస్మయం వ్యక్తం చేసాడని రాయటం ఆ పత్రికలకే చెల్లింది. 

0/Post a Comment/Comments

Previous Post Next Post