పోలింగ్ స్టేషన్ పై ఆత్మాహుతి దాడి - 31 మంది ఓటర్ల మృతి

పోలింగ్ స్టేషన్ పై ఆత్మాహుతి దాడి - 31 మంది ఓటర్ల మృతి
పాకిస్తాన్ లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.  క్వెట్టా నగరంలో పౌరులు ఓటు వేస్తున్న సందర్భంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో 31 మంది మరణించగా, మరో 35 మంది గాయ పడ్డారు. 

ప్రత్యక్ష్య సాక్షుల కథనం ప్రకారం ఒక వ్యక్తి మోటారు సైకిల్ పై పోలింగ్ బూత్ లో వేగంగా దూసుకెళ్లిన వెంటనే పెద్ద పేలుడు సంభవించింది. ఆ వెంటనే ఆ ప్రాంతాన్ని పొగ, ధూళి కమ్ముకుంది. గాయపడ్డ వ్యక్తుల ఆర్తనాదాలతో మారుమోగింది.

బెలూచిస్తాన్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా   పలు హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక ఎన్నికల ర్యాలీ సందర్భంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో కూడా అభ్యర్థి తో సహా 149 మంది చనిపోయారు. 400 మందికి పైగా గాయ పడ్డారు. దీనితో ఆ నియోజక వర్గంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. 

భద్రతా కారణాల దృష్ట్యా బెలూచిస్తాన్ ప్రాంతంలో టెలిఫోన్, ఇంటర్ నెట్ సౌకర్యాలు నిలిపివేయబడ్డాయి. ఈ ప్రాంతంలో అభ్యర్థులకు, పోలింగ్ సిబ్బందికి బెదిరింపులు కూడా వచ్చాయి అని ఎన్నికల అధికారులు తెలియచేసారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post