తిరుమలలో భక్తులను అనుమతించండి - చంద్రబాబు

తిరుమలలో భక్తులను అనుమతించండి - చంద్రబాబు
మహాసంప్రోక్షణ సందర్భంగా తిరుమల ఆలయంలోకి భక్తులను అనుమతించకూడదని టిటిడి బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోనుంది. ఆలయ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 9 రోజుల పాటు భక్తులను అనుమతించమని ప్రకటించటంతో అన్ని వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆలయం మూసివేసి లోపల ఎదో చేస్తున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. 

స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి, అధికారులతో సమావేశమై ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవలసిందిగా టిటిడిని ఆదేశించారు. ఆలయాన్ని పూర్తిగా మూసివేయవద్దని, భక్తులను పరిమిత సంఖ్యలో అనుమతించాలని, ప్రతి మహా సంప్రోక్షణకు ఎలాంటి నియమాలు పాటిస్తున్నారో అవే పాటించాలని సీఎం పేర్కొన్నారు.  

0/Post a Comment/Comments

Previous Post Next Post