సుదీర్ఘంగా ఏడు గంటల పాటు సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. అజెండాలో 60+ అంశాలుండటంతో ఇంత సమయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ సమావేశంలో ఆమోదించిన అంశాలు
- ఈ నెల 31న సర్పంచుల పదవి కాలపరిమితి ముగుస్తుండటంతో అవి ప్రత్యేకాధికారుల పాలనలోకి వెళ్లనున్నాయి.
- సత్వరమే శాస్త్రీయంగా బీసీ గణన, అనంతరం పంచాయితీ ఎన్నికల నిర్వహణ
- ఆగస్ట్ 15 నుండి ప్రారంభమవనున్న కంటి వెలుగు
- జూనియర్ కాలేజీ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం ఏర్పాటు కోసం పరిశీలన
- నియోజక వర్గానికి ఒకటి చొప్పున 119 కొత్త బీసీ గురుకులాలు, వాటి కోసం 4284 పోస్టుల భర్తీ
- 9355 గ్రామ కార్యదర్శుల నియామకాలు
- పోలీసుశాఖ కోసం 11,577 కొత్త వాహనాల కొనుగోలు
- గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకు జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం గజానికి 100 రూపాయల చొప్పున ఎకరానికి మించకుండా స్థలాల కేటాయింపు. వాటికి ఆస్తి పన్ను నుండి మినహాయింపు.
- సూర్యాపేటలో మెడికల్ కాలేజీ ఏర్పాటు
- మాజీ హోం మంత్రి మాధవరెడ్డి కుటుంబానికీ, సరిహద్దులో మరణించిన జవాన్ ఫిరోజ్‌ఖాన్ కుటుంబానికి షేక్ పేటలో ఇంటి స్థలాల కేటాయింపు
Post a Comment