న్యాయస్థానం తీర్పును ఉద్దేశ్య పూర్వకంగానే అమలు చేయలేదని తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్ లపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కోర్టు పేర్కొన్న ఉత్తర్వులను అమలు చేయక పోవటం కోర్టు ధిక్కరణ అవుతుందని, స్పీకర్ కు కూడా కోర్టుకు హాజరయ్యేలా ఉత్తర్వులిచ్చే అధికారం కోర్టుకు ఉంటుందని స్పష్టం చేసింది.
సస్పెండైన ఎమ్మెల్యేలిద్దరికీ తిరిగి భద్రత కల్పించకపోవడం పై కూడా హైకోర్టు మండిపడింది. కోర్టు ఉత్తర్వులను నిర్లక్ష్యం చేయడానికి ఎస్పీలకు ఎంత ధైర్యమని ప్రశ్నించింది. తాము శాసన వ్యవస్థతో ఘర్షణ వైఖరిని కోరుకోవటం లేదని పేర్కొంటూ ఆగస్టు 3వ తేదీకి కోర్టు ధిక్కరణ కేసుని వాయిదా వేసింది.
Post a Comment