ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కృష్ణా నీటి కేటాయింపులు


జులై ఆగస్ట్ నెలల కోసం రెండు తెలుగు రాష్ట్రాలకు అవసరమైన నీటిని కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్ కేటాయించింది. ఈ మేరకు  శ్రీశైలం నుండి నేటి నుండి రోజుకు  రెండు టిఎంసిల నీటిని నాగార్జునసాగర్ కు విద్యుత్ ఉత్పత్తి ద్వారా విడుదల చేయాలని ఆదేశించింది. ఒక వేళ విద్యుత్ అవసరాలు లేకపోతే స్పిల్ వే ద్వారా తరలించాలని సూచించింది. 

ఇక శ్రీశైలం ప్రాజెక్టు నుండి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముకు 10 టీఎంసీలు, పోతిరెడ్డి పాడు ద్వారా 9 టీఎంసీలు, హంద్రీ నీవా ద్వారా 5 టీఎంసీలు వాడుకోవాలని తేల్చింది. 

నాగార్జున సాగర్ నుండి ఆంధ్రప్రదేశ్ అవసరాల కోసం కుడి కాల్వ ద్వారా ఏడున్నర టీఎంసీలు, ఎడమ కాల్వ ద్వారా మూడున్నర టీఎంసీలు విడుదల చేయాలని సూచించింది. తెలంగాణకు ఎడమ కాలువ అవసరాల కోసం 12 టీఎంసీలు, మిషన్ భగీరథకు 2 టీఎంసీలు, హైదరాబాద్ నల్లగొండల తాగునీటి అవసరాల కోసం 6 టీఎంసీలు కేటాయించింది.  ఈ మధ్యకాలంలో శ్రీశైలం నిండక ముందే నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేయటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించటం ఇదే ప్రథమం.  

0/Post a Comment/Comments

Previous Post Next Post