జిఎస్టీ తెలంగాణ ఆదాయం జంప్

జిఎస్టీ తెలంగాణ ఆదాయ వృద్ధి
పన్నుల ద్వారా తెలంగాణ ఖజానాకు లభించే ఆదాయంలో  అంతకంతకూ వృద్ధి కనిపిస్తుంది. స్టేట్ ఓన్డ్ టాక్స్ రెవెన్యూ (SOTR) లో చెప్పుకోదగ్గ వృద్ధిని నమోదు చేసిన తరువాత, రాష్ట్రం గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (GST) లో కూడా అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది.

GST లో తెలంగాణ ఆదాయ వృద్ధి దాదాపు 15% వరకు ఉంది. తొలుత రాష్ట్రం దీనివల్ల ఆదాయం కోల్పోతుందని భయపడగా, అటువంటిది ఏమీ జరగలేదు.


రాష్ట్ర కమర్షియల్ టాక్స్ విభాగం కూడా మంచి వృద్ధిని నమోదు చేసింది. ప్రజల కొనుగోలు శక్తి పెరగడం వల్ల వాణిజ్య పన్నుల వసూలులో అభివృద్ధి కనిపించిందని నిపుణులు భావిస్తున్నారు. 


0/Post a Comment/Comments

Previous Post Next Post