గత సంవత్సరం దేశవ్యాప్తంగా గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అమల్లోకి వచ్చింది. ఇది అమల్లోకి వచ్చిన తొలి రోజుల్లో రాష్ట్ర ఆదాయం తగ్గినప్పటికీ, రాను రాను వృద్ధి కనిపించింది. తొలి పదకొండు నెలలలో 22,733 కోట్లు ఆదాయం లభించింది.
జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తొలి నెల రాష్ట్ర కమర్షియల్ టాక్స్ విభాగంలోనూ, వ్యాపారస్తుల్లోనూ అయోమయం నెలకొంది. దీనితో ప్రత్యేకంగా అవగాహన కల్పించడానికి బృందాలను, కాల్ సెంటర్లను ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే వసూళ్లు పుంజుకున్నాయి.
2017 జూలై నుంచి 2018 మే నెల వరకు సెంట్రల్ ట్యాక్స్ - సీజీఎస్‌టీ 5,330.39 కోట్ల రూపాయలు వసూలుకాగా, ఐజీఎస్‌టీ 7,950.23 కోట్ల రూపాయలు, ఎస్‌జీఎస్‌టీ 9,028.52 కోట్ల రూపాయలు వసూలైంది. ఈ 11 నెలల కాలంలో కొన్ని వస్తువులపై ప్రత్యేకంగా విధిస్తున్న సెస్ ద్వారా 209.65 కోట్లు వసూలయ్యాయి. రిటర్న్స్ ఫైలింగ్ లో కూడా వృద్ధి 74.62 % కనిపించడం గమనార్హం.

Post a Comment