భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో (FDI ) వృద్ధి గత అయిదు సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరింది. 2017-18లో కేవలం 3% వృద్ధితో 44.85 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత సంవత్సరాలలో FDI లు 2016-17 లో 8.67%, 2015-16 లో 29%, 2014-15లో 27%, 2013-14లో 8% పెరిగాయి.
కన్స్యూమర్, రిటైల్ రంగాలలో పెద్దగా విదేశీ పెట్టుబడులు రాకపోవటం, మన దేశంలో ఉన్న విధానపరమైన సంక్లిష్టత మరియు అనిశ్చితి దీనికి కారణమని నిపుణులు భావిస్తున్నారు.
Post a Comment