ఉక్కు పరిశ్రమ కోసం గడ్డం తీయను

ఉక్కు పరిశ్రమ కోసం గడ్డం తీయను
ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం తాను చేసిన దీక్షను ఇంకా కొనసాగిస్తున్నానని ఎంపీ సీఎం రమేశ్‌ తెలిపారు. కేవలం ద్రవ పదార్థాలనే ఆహారంగా తీసుకుంటున్నానని, రేపు అనంతపురంలో జరిగే దీక్షలో కూడా పాల్గొంటానని ఆయన అన్నారు. పరిశ్రమకు పునాది రాయి పడే వరకు తాను గడ్డం తీయమని ఆయన శపథం చేసారు. 

తిరుమలలో స్వామి వారిని రమేశ్‌ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేశ్‌‌కు ఆలయ పండితులు వేదాశీర్వచనం పలికి, శేష వస్త్రాన్ని, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.  అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

0/Post a Comment/Comments