దేశంలోని అన్ని పార్లమెంట్ మరియు శాసన సభా స్థానాలకు ఒకేసారి ఎన్నికల నిర్వహించాలనే విషయంపై దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు బిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసాయి. కొన్ని పార్టీలు సానుకూలంగా స్పందించగా, ఎక్కువ పార్టీలు వ్యతిరేకించాయి. దీనిలో రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు తమ అభిప్రాయాన్ని కమిషన్ కు తెలపలేదు. బిజెపి దీనికి అనుకూలమని ఇప్పటికే ప్రకటించగా, కాంగ్రెస్ మిత్రపక్షాలు, ఇతర రాజకీయ పార్టీలతో చర్చించిన తరువాత తన అభిప్రాయాన్ని తెలియజేస్తామని వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్), సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) , జనతా దళ్ (యునైటెడ్), షిరోమణి అకాలీదళ్ మరియు అన్నాడిఎంకె లు సానుకూలంగా స్పందించాయి.
తృణమూల్ కాంగ్రెస్, సిపిఐ, ద్రావిడ మున్నేట్ర కజగం (డిఎంకె), జనతా దళ్ (సెక్యులర్), మరియు ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) జమిలి ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకించాయి. టిడిపి ఖచ్చితంగా ఎటూ తేల్చి చెప్పలేదు.
Post a Comment