ఛత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి, రాబోయే ఎన్నికల కోసం విచిత్రమైన హామీని ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం విధిస్తామని, కానీ దానిలో గిరిజనులకు మినహాయింపు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. తాగటం గిరిజనుల సంస్కృతిలో భాగం అని అందుకే ఈ నిర్ణయమని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లోని వ్యక్తులు తమ డబ్బంతా తాగటానికే వెచ్చిస్తున్నారని వారికి నిషేధం అవసరమని ఆయన అన్నారు.
రాబోయే ఎన్నికలలో జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ పార్టీ రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేయనుందని అజిత్ జోగి అన్నారు. తాము మహిళలు, రైతులు మరియు నిరుద్యోగుల సమస్యలు ప్రధాన ఎజెండాగా ఎన్నికలకు వెళ్లనున్నామని తెలియచేసారు. 2016 లో అజిత్ జోగి ఈ పార్టీని స్థాపించారు. 2000 నుండి 2003 వరకు ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రిగా పని చేసారు.
Post a Comment