ముఖ్యమంత్రి కెసిఆర్ 9,200 మంది పంచాయతీ కార్యదర్శులను నియమించటానికి నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదివారం రోజు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ప్రత్యేకంగా పంచాయతీ కార్యదర్షి ఉండాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. వారంలోగా నోటిఫికేషన్ విడుదలవనుందని, రెండు నెలల లోగా నియామకాలు పూర్తవనున్నాయని ఒక ప్రకటనలో తెలిపారు.
ఇక నుండి ఇన్-ఛార్జ్ సెక్రెటరీల సంస్కృతి పోనుందని, కొత్తగా మియమింపబడే కార్యదర్శులు మూడు సంవత్సరాల పాటు ప్రొబేషన్ కలిగి ఉంటారని, దాని తరువాత వారి సేవలు వారి పనితీరు ఆధారంగా క్రమబద్ధీకరించబడతాయని వివరించారు. జిల్లా కేడర్ గా ఈ నియామకాలు చేపట్టనున్నారు.
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 12,751 పంచాయితీలు ఉండగా, కేవలం కేవలం 3,562 మంది పంచాయతీ కార్యదర్శులు మాత్రమే ఉన్నారు. రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో ఏర్పాటు చేసిన పంచాయితీలతో ఈ సమస్య ఇంతలా పెరిగింది.
పంచాయత్ రాజ్ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు, చీఫ్ సెక్రటరీ S.K. జోషిలు, పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్ మరియు కమిషనర్ నీతూ ప్రసాద్ లకు పంచాయితీ కార్యదర్శుల ఎంపికకు సంబంధించిన మార్గదర్శకాలను సిద్ధం చేసే బాధ్యతలు అప్పగించారు.
Post a Comment