చైనా, రష్యా మరియు ఇరాన్లతో భారత దేశం వ్యవహరించే తీరు అమెరికా విదేశాంగ విధానాన్ని అయోమయానికి, ఆందోళనకు గురి చేస్తుంది. సెప్టెంబర్లో భారత్, అమెరికాల మధ్య 2+2 చర్చలు జరగటానికి ముందే భారత మంత్రులు చైనా, రష్యాలతో చర్చలు జరపటం, ఇరాన్ మంత్రులు ఇక్కడికి రావటం దీనికి కారణాలుగా మాజీ భారత దౌత్య వేత్త ఆష్లే టెల్లీస్ తెలిపారు.
గత జనవరిలో ట్రంప్ అమల్లోకి తెచ్చిన CAATSA చట్టం ప్రకారం రష్యా, ఇరాన్లతో వాణిజ్యం జరిపే వారిపై ఆంక్షలు విధించనున్నారు. దీని ప్రభావం భారత దేశం పై తీవ్రంగా ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. ఇప్పుడు మారిన పరిస్థితులలో ఇండియాను తాము ఆసియాలో వ్యూహాత్మక భాగస్వామిగా పరిగణిస్తున్నామని, ఇరాన్ చమురు భారతదేశానికి ముఖ్యం కావటంతో ఆ చట్టంలో మినహాయింపు ఇవ్వాలని భావిస్తున్నామని, కానీ ఇది ఎంతవరకు అమల్లోకి వస్తుందో చూడాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసారు. రష్యా S -400 దిగుమతుల విషయంలో మాత్రం ఇప్పుడే ఏమీ చెప్పలేమని ఆయన అన్నారు.
ఇండియా అమెరికా వ్యతిరేక ధోరణిని అవంబిస్తుందని తాము భావించటం లేదని అయితే, తమ వాణిజ్యం, రక్షణ సంబంధిత విషయాలలో వ్యూహాత్మకంగా విభిన్న దేశాలతో వ్యవహరించాలని చూస్తుందని ఆయన తెలిపారు.
Post a Comment