శ్రీరెడ్డికి నేను అవకాశాలు ఇస్తాను

శ్రీరెడ్డికి నేను అవకాశాలు ఇస్తాను
ఈ మధ్య తమిళ సినీ పరిశ్రమపై వరుసగా ఆరోపణలు సంధిస్తున్న శ్రీరెడ్డికి అక్కడ అండ దొరికింది. ఆమెకు అవకాశాలు కల్పిస్తానని ప్రముఖ తమిళ టీవీ సీరియల్ నిర్మాత కుట్టి పద్మిని ముందుకొచ్చింది. ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించింది.

శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణలు నూటికి నూరు శాతం నిజమని, 1980ల నుంచే పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందన్న విషయం తెలుసునని కుట్టి పద్మిని అన్నారు. ప్రస్తుత పరిస్థితులలో ఆమెకు సహాయం అవసరమని, అవకాశం కల్పిస్తే తనను తాను నిరూపించుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేసారు. గత మూడు నెలలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా శ్రీరెడ్డి ఆరోపణలతో సంచలనం రేపిన విషయం తెలిసిందే.

శ్రీరెడ్డి కూడా తీవ్రమైన డిప్రెషన్ తో బాధ పడుతున్నట్టు ఆమె పెడుతున్న పోస్టులు తెలియచేస్తున్నాయి. ఆమె ఆత్మ హత్య ఆలోచనలను గురించి కొంత కాలంగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుంది. కొద్ది రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూ లోనూ "నేను బాధితురాలిని, న్యాయాన్ని ఎలా పొందాలో నాకు తెలియటం లేదు. ఎక్కడికి వెళ్లినా ప్రాస్టిట్యూట్ అని అవమానిస్తున్నారు. చనిపోవాలనిపిస్తుంది."  అని వెల్లడించింది. ఆమె పనిలో పడిపోతే కోలుకోగలదని మానసిక నిపుణుల అంచనా.

ఈ విషయమై కుట్టి పద్మిని గారికి శ్రీరెడ్డి ఫేస్బుక్ ద్వారా కృతజ్ఞతలు కూడా తెలిపింది.


0/Post a Comment/Comments

Previous Post Next Post