హృదయంతో ప్రేమలో పడ్డాను.... రంగు, జాతీయత చూసి కాదు

హృదయంతో ప్రేమలో పడ్డాను.... రంగు, జాతీయత చూసి కాదు
గోవా బ్యూటీ ఇలియానా ఒక నెటిజెన్ సోషల్ మీడియాలో అడిగిన ప్రశ్నకు తెలివైన సమాధానం ఇచ్చింది. ఆ వ్యక్తి, మీరు భారతీయులై ఉండి  ఓ విదేశీయుడితో ఎందుకు డేటింగ్‌ చేస్తున్నారు అని ప్రశ్నించగా, నా హృదయం అతనితో ప్రేమలో పడింది. రంగు, జాతీయత చూసి నేను ప్రేమలో పడలేదు అని సమాధానమిచ్చింది. ఇదే కాకుండా బాడీ షేమింగ్ విషయంలో కూడా ఎదురైన ప్రశ్నకు ఆమె దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది.  దీనికి నెటిజన్లు ఫిదా అయ్యారు. కాగా పెళ్లి అయిందా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వకుండా దాటవేసింది. 

ఇలియానా గత కొన్ని సంవత్సరాలుగా ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్‌తో కలిసి ఉంటున్న విషయం తెలిసిందే. క్రిస్మస్ సమయంలో ఆండ్రూని తన భర్త అని ఒక పోస్టులో తెలిపింది, కానీ తర్వాత మాత్రం లవర్ అని అంటుంది. తన జీవితం ఇప్పుడు వృత్తిపరంగా మరియు వ్యక్తిగతంగా బావుందని మరో ప్రశ్నకు సమాధానంగా తెల్పింది. 

0/Post a Comment/Comments

Previous Post Next Post