పూరి జగన్నాథ రథయాత్రకు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రత్యేక రైళ్లు నడపనుందని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ జి.సునీల్ కుమార్ తెలిపారు.
గుండిచా యాత్ర(14-07-18): విశాఖపట్నం-పూరి (08907) ప్రత్యేక రైలు విశాఖపట్నంలో జూలై 13వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి 14వ తేదీ మధ్య రాత్రి 1.15 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (08908)పూరిలో ఈ నెల 15వ తేదీ తెల్లవారు ఉదయం (14వ తేదీ మధ్య రాత్రి) 12.30 గంటలకు బయల్దేరి అదేరోజు ఉదయం 10.55 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
బహుదా యాత్ర (22.07.18): విశాఖపట్నం-పూరి (08907) ప్రత్యేక రైలు విశాఖపట్నంలో 21వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు బయల్దేరి 22వ తేదీ తెల్లవారు 1.15 గంటలకు పూరి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (08908) పూరిలో 23వ తేదీ (22వ తేదీ అర్థరాత్రి) 12.30 గంటలకు బయల్దేరి అదేరోజు ఉదయం 10.55 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
సునావేశ (23.7.18): విశాఖపట్నం – పూరి (08907) ప్రత్యేక రైలు విశాఖపట్నంలో 23వ తేదీ ఉదయం 11.30 గంటలకు బయల్దేరి అదేరోజు రాత్రి 7 గంటలకు పూరి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (08908) పూరిలో 24వ తేదీ (23 అర్థరాత్రి) 1 గంటకు బయల్దేరి అదేరోజు ఉదయం 10.55 గంటలకు విశాఖ చేరుతుంది. ఈ ప్రత్యేక రైళ్లు 9 జనరల్ సెకండ్ క్లాస్, 1-లగేజీ కమ్ బ్రేక్ వ్యాన్ కోచ్‌లతో ప్రయాణిస్తుంది. వాల్తేరు డివిజన్‌లో గల అన్ని పాసింజర్ స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయని, యాత్రికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సీనియర్ డీసీఎం తెలిపారు.
Post a Comment