తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి టీఎస్ ఎడ్‌సెట్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ మేరకు రెండు సంవత్సరాల బీఈడీ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులకు సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ కౌన్సెలింగ్ వివరాలను గురువారం వెల్లడించింది.
ఈనెల 9వ తేదీ నుంచి 13 వరకు ర్యాంకుల వారీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్‌ను నిర్వహించనున్నారు. ఎన్‌సీసీ, స్పోర్ట్స్, క్యాప్, పీహెచ్ కేటగిరీల కు ఈనెల 11 నుంచి 13 వరకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉండనుంది. వెబ్ ఆప్షన్స్‌ను నమోదు చేసుకునేందుకు విద్యార్థులు ఈనెల 10 నుంచి 15 వరకు అవకాశమిచ్చారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు సంబంధించి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.500, ఇతరులు రూ.800 చెల్లించాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ నమోదుకు ముందు కాలేజీల వారీగా కన్వీనర్ కోటా, ట్యూషన్ ఫీజు వంటి వివరాలను సంబంధిత వెబ్‌సైట్‌లో చూసుకోవాల్సి ఉంటుంది. స్పెషల్ కేటగిరీ విద్యార్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హైదరాబాద్ గగన్‌మహాల్‌లోని ఏవీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, వరంగల్ విద్యారణ్య పురి లోని డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్‌లో మాత్రమే జరుగుతాయని టీఎస్ ఎడ్‌సెట్ కన్వీనర్ తెలిపారు. పూర్తి వివరాలకు http://edcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు.
Post a Comment