క్యాన్సర్ చికిత్స కోసం న్యూయార్క్‌లో ఉన్న సొనాలీ బింద్రే జుట్టు కత్తిరించుకున్నారు. తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సొనాలీ, భావోద్వేగానికి గురయ్యారు. ఈ సమయంలో తోడుగా ఉంటున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
సోనాలి ట్వీట్ ఆవిడ మాటల్లోనే
నా అభిమాన రచయిత్రి ఇసాబెల్ అలెండే తెలిపిన పదాల్లోనే "కష్టం వచ్చినపుడే మనలో ఉన్న దైర్యం బయటకు వస్తుంది. విషాదకరమైన, యుద్ధ సమయాల్లోనే కొన్ని అద్భుతాలు జరుగుతాయి. మనుగడ విషయాల్లో మానవ సామర్థ్యం అద్భుతం. గత కొంత కాలంగా నాపై ప్రేమాభిమానాలు కురిపిస్తున్న అందరికీ ధన్యవాదాలు. క్యాన్సర్తో వ్యవహరించడంలో మీ అనుభవాల గురించి పంచుకున్నవారికి నేను కృతజ్ఞురాలిని. మీ కథలు నాకు బలం మరియు ధైర్యాలను ఇచ్చాయి, మరియు మరి ఆశల్ని కలిగిస్తున్నాయి. ప్రస్తుతం నా జీవితంలో ప్రతిరోజూ ఒక సవాలుతో కూడుకున్నదే. సూర్యోదయం కోసం సానుకూల దృక్పథంతో ఎదురుచూస్తున్నాను"
— Sonali Bendre Behl (@iamsonalibendre) 10 July 2018
— Sonali Bendre Behl (@iamsonalibendre) 10 July 2018
Post a Comment