టిఆర్ఎస్ నేత, రామగుండం ఎమ్మెల్యే, టిఎస్ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, తాను క్రియాశీల రాజకీయాల నుండి రిటైరవుతున్నానని సోమవారం రోజు ప్రకటించి కలకలం రేపారు. అయితే ఆయనపై అధిష్టానం నుంచి వచ్చిన వత్తిడి, బుజ్జగింపులు పనిచేయటంతో మంగళవారం రోజు ఆ నిర్ణయం నుండి వెనక్కు తగ్గారు.
మంగళవారం రోజు ఆయనను కెసిఆర్ ప్రత్యేకంగా ప్రగతి భవన్ కు పిలిపించారు. అక్కడ మంత్రి కేటీఆర్‌తో ఆయన సమావేశమయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి టిఆర్ఎస్ భవన్ కు వచ్చారు. అక్కడ సత్యనారాయణ మాట్లాడుతూ తాను ఎన్నడూ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేయలేదని, కెసిఆర్ ఆజ్ఞను శిరసావహిస్తానని అన్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలసి నల్గొండ జిల్లా నకిరేకల్ లో జరిగిన పార్టీ కార్యక్రమం లో కూడా పాల్గొన్నారు.
సోమవారం రోజు రామగుండం మున్సిపాలిటీలో అధికార పార్టీ కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం దిశగా తీసుకున్న నిర్ణయం పై కేటీఆర్‌తో విభేదాలు రావటం, కార్పొరేటర్లు కూడా పట్టిన పట్టు వీడకపోవటం తో ఆయన ఈ రిటైర్మెంట్ నిర్ణయాన్ని తీసుకున్నారు.
Post a Comment