పంజాబ్ రాష్ట్రంలో మంత్రి కాళ్ళను మొక్కినందుకు, ఎఎస్ఐ ఉద్యోగాన్ని పోగొట్టుకోవలసి వచ్చింది. త్రిపట్ రాజిందర్ సింగ్ బాజ్వా పంజాబ్ గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీ రాజ్ శాఖా మంత్రి. ఆయన జనతా దర్బార్ నిర్వహించే సమయంలో ఫతేఘర్ బుండి ఎఎస్ఐ పల్విందర్ సింగ్ వచ్చాడు. అతను వచ్చీ రాగానే మంత్రి కాళ్లకు మొక్కడంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. ఎఎస్ఐ వివరాలు తీసుకోమని సిబ్బందిని పురమాయించారు. అంతటితో ఆగకుండా వెంటనే ఐ.జి.కి ఫోన్ చేసి ఈ సంఘటనను వివరించి అతన్ని సస్పెండ్ చేయవసిందిగా కోరాడు. ఆ మేరకు అతను విధుల నుండి తొలగింపబడ్డాడు.
ఎస్పి సుబా సింగ్ మాట్లాడుతూ ఎఎస్ఐ పల్విందర్ సింగ్ ను సస్పెండ్ చేసాము. అతనిపై దర్యాప్తు జరుగుతుందని తెలిపారు. యూనిఫాంలో ఉన్న ఏఎస్ఐ, ప్రజల మధ్య మంత్రి భజ్వా పాదాలు తాకడం క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘించడమే. ఇలా చేయడం వల్ల ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయి. అతనికి ఏదైనా సమస్య ఉంటే నాకో, ఇతర సీనియర్ అధికారులకో చెప్పి ఉండాల్సింది. ఇలాంటి క్రమశిక్షణరాహిత్య చర్యలు ఊపేక్షించబోమని అన్నారు.
మంత్రి బాజ్వాను కలిసేందుకు వస్తున్న వాళ్లలో చాలామంది ఆయన కాళ్ళు మొక్కుతున్నారట. ఆయన ఈ తరహా విధానాన్ని ఇష్టపడక తన ఇంటి బయట, కార్యాలయం బయట తన పాదాలను తాకి ఇబ్బంది పెట్టవద్దని నోటీసులను కూడా పెట్టాడు.
Post a Comment