నేడు అంశిక (పాక్షిక) సూర్య గ్రహణం. భూమి పైన చంద్రుని నీడ పడిన ప్రాంతంలో సూర్య గ్రహణం సంభవిస్తుంది. పాక్షిక సూర్య గ్రహణ సమయంలో, సూర్యుడిలో కొద్ది భాగానికి మాత్రమే చంద్రుడు అడ్డుగా నిలుస్తాడు.
అయితే ఇవాళ ఏర్పడనున్న సూర్య గ్రహణం దాక్షిణార్ధ గోళంలో కొద్ది ప్రాంతానికి మాత్రమే పరిమితం కానుంది. స్టీవర్ట్ ఐలాండ్, న్యూజీలాండ్ మరియు ఆస్ట్రేలియా లోని అడిలైడ్, హోబర్టు, మెల్బోర్న్ పట్టణాలలో ఇది కనిపించనుంది. ఆసియ, ఐరోపా, ఆఫ్రికా మరియు ఉత్తర దక్షిణ అమెరికాలలో సూర్యగ్రహణం కనిపించదు.
Post a Comment