గత కొంత కాలంగా కంటి సమస్యతో బాధపడుతున్న జన సేన అధ్యక్ష్యుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆపరేషన్ చేయించుకున్నారు. గురువారం రోజు ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో ఈ సర్జరీ జరిగింది.
గత కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ ఎడమ కంట్లో కురుపుతో బాధపడుతున్నారు. ఆయనే ఈ సమస్య ఉన్నదని రంగస్థలం సక్సెస్ మీట్ లో వెల్లడించారు. అప్పటినుండి నల్ల కళ్లద్దాలు వాడుతున్నారు. సర్జరీ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నా, ఆయన ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చారు. కానీ బుధవారం రోజు నొప్పి ఎక్కువగా ఉండటంతో ఆసుపత్రిలో చేరారు. గురువారం సర్జరీ జరిగింది. మరికొన్ని గంటలలో డిశ్చార్జ్ చేయనున్నట్లు సమాచారం. నాలుగు రోజుల పాటు విశ్రాంతి తీసుకోమని వైద్యులు సూచించారు.
ఈ నెల 16 వ తేదీ నుండి పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలో పర్యటించవలసి ఉంది. అయితే ఇప్పుడు దానిపై అనుమానాలు నెలకొన్నాయి. దీనిపై ఇవాళ జనసేన పార్టీ నుండి కానీ, పవన్ కళ్యాణ్ నుండి గానీ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Post a Comment