కర్ణాటక అసెంబ్లీలో గురువారం రోజు అరుదైన సంఘటన జరిగింది. ముగ్గురు ప్రత్యర్థులు కలిసి విందు ఆరగించారు. ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య మరియు ప్రతిపక్ష నేత యడియూరప్పలు ఒకే టేబుల్ పై కలిసి కూర్చొని భోజనం చేసారు.
భోజన విరామ సమయానికి కాస్త ముందే యడ్యూరప్ప మరియు సిద్దరామయ్య అసెంబ్లీ హాలులో ఒకరిపై ఒకరు రైతులకి ఇచ్చిన వాగ్దానాలపై తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. మూడు రోజుల క్రితం యడ్యూరప్ప మరియు కుమార స్వామిలు ఒకరి నొకరు మోసగాళ్లు, అవినీతిపరులు, అధికారం కోసం కక్కుర్తి పడేవాళ్లు అని తిట్టుకున్నారు.
అయితే నిన్న మాత్రం కుమారస్వామి, యడ్యూరప్ప భుజాలపై చేతులు వేసి మరీ తన టేబుల్ వద్దకు తీసుకెళ్లాడు. తన పక్కన కుర్చీ లాగి సిద్ధ రామయ్య పక్కన కూర్చోపెట్టాడు. మూగ్గురూ కలిసి నవ్వుకుంటూ మాట్లాడుతూ భోజనాన్ని ఆస్వాదించారు. అన్ని పార్టీల అగ్ర నాయకులు అక్కడే చేరారు.
ఆ తర్వాత వారు మాట్లాడుతూ తాము రాజకీయంగా ప్రత్యర్థులమైనా, వ్యక్తిగతంగా మిత్రులమే అని అన్నారు. మీడియాతో మరియు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు రాజకీయంగా మాట్లాడవలసి ఉంటుందని తెలిపారు.
Post a Comment