ఆదివారం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని తల్వారా వద్ద నున్న సియార్ బాబా జలపాతం వద్ద భారీ సంఖ్యలో ప్రజలు స్నానం చేస్తున్నప్పుడు 100 అడుగుల ఎత్తునుండి కొండచరియ దొర్లిపడటంతో ఏడుగురు మృతి చెందారు. దాదాపు 30 మంది గాయపడ్డారు.
రేసి జిల్లా ఎస్పీ తాహిర్ సాజద్ భట్ మాట్లాడుతూ గాయపడిన వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని తెలిపారు. వారిలో ఎక్కువ మంది యువత మరియు జమ్మూ జిల్లాకు చెందిన వారు అని వెల్లడించారు.
సహాయక చర్యల్లో పాల్గొన్నవారు, ఆ సమయంలో గాయపడినవారికి చికిత్స కోసం జిల్లా ఆసుపత్రిలో అవసరమైన వైద్యులు అందుబాటులో లేరని విమర్శించారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసారు.

Post a Comment