పాకిస్తాన్లో జులై 25న జరగనున్న సాధారణ ఎన్నికలకు ముందు హఫీజ్ సయీద్ స్థాపించిన మిల్లి ముస్లిం లీగ్ (ఎంఎల్ఎల్) కు చెందిన ఖాతాలను, పేజీలను ఫేస్ బుక్ తొలగించింది. ఆయన జమాత్-ఉద్-దావా మత సంస్థకు కూడా అధ్యక్ష్యుడు అన్న విషయం తెలిసిందే.
ఫేస్ బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్ బర్గ్ తన సామాజిక నెట్ వర్కింగ్ వెబ్ సైట్, పాకిస్తాన్, భారతదేశం, బ్రెజిల్, మెక్సికో మరియు ఇతర దేశాలలో రాబోయే ఎన్నికలలో జోక్యం కలిగించుకోదని, కేవలం సానుకూల ప్రచారం మాత్రమే చేసుకోవచ్చని వివరించారు. ఇటీవలే పాకిస్తాన్ ఎన్నికల కమిషన్, ఫేస్ బుక్ ను సంప్రదించి రాజకీయ పార్టీల నకిలీ పేజీలను గుర్తించి తొలగించాల్సిందిగా విజ్ఞప్తి చేసారు.
పాకిస్తాన్ ఎలక్షన్ కమిషన్ మిల్లి ముస్లిం లీగ్ ను రాజకీయ పార్టీగా గుర్తించలేదు. లష్కర్ -ఏ -తోయిబా తో సంబంధాలు ఉన్న కారణంగా అమెరికా మిల్లి ముస్లిం లీగ్ ను ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. తన పార్టీకి గుర్తింపు రాకపోవటంతో హఫీజ్ సయీద్ తన అభ్యర్థులను ఇప్పటికే గుర్తింపు పొంది ఉన్న, ఎవరికీ పెద్దగా తెలియని అల్లా-ఓ-అక్బర్ తెహ్రీక్ పార్టీ తరపున నిలబెట్టాడు.
ఏ కారణం లేకుండా పార్టీ అభ్యర్థుల మరియు కార్యకర్తల ఖాతాలు తొలగించటం, ఫేస్ బుక్ తన సొంత విధానాలను ఉల్లంఘించటమే మరియు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాలరాయడమేనని మిల్లి ముస్లిం లీగ్ ప్రతినిధి తబీష్ ఖయ్యూమ్ అన్నారు.
Post a Comment