చేపలు తినటం మానేసిన గోవా

చేపలు తినటం మానేసిన గోవా
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారీకర్ ఆదివారం రోజు మాట్లాడుతూ, ఫార్మాలిన్ వాడకం పై వస్తున్న వార్తలతో  గోవాలో చేపలు తినడం ఆపివేసినందువలన, ఈ విషయం పై తాను పర్యవేక్షిస్తున్నానని అన్నారు.

గోవాలో చేపలు ప్రధాన ఆహారం. చేపలు లేకుండా తినటం గోవా ప్రజలకు కష్టమైన విషయమే. మీరు చింతించవద్దు. త్వరలోనే సర్దుకుంటుంది. అని తెలిపారు. గోవా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు గత వారం ఇతర రాష్ట్రాల నుండి వచ్చే చేపలను పరీక్షించి వాటిని నిల్వ ఉంచటానికి ఫార్మాల్డిహైడ్ ను ఉపయోగించారని నిర్దారించారు. 

వ్యవసాయ శాఖ మంత్రి విజయ్ సర్దేశాయ్ చేపలు తినడానికి అనువైనవే అని చేసిన ట్వీట్ వివాదాస్పమైనది. దీని తర్వాత ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ విడుదల చేసిన ప్రకటనలో ఫార్మలిన్ అనుమతించిన పరిమితిలోనే ఉంది అని ప్రకటించింది. గోవాలో ఫిష్ మార్కెట్లు గత కొన్ని రోజులుగా సంక్షోభంలో ఉన్నాయి. వినియోగదారులు చేపల నాణ్యతపై అనుమానంతో వాటికి దూరంగా ఉన్నారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post