అల్లు అర్జున్ నటించిన సరైనోడు చిత్రం యూట్యూబ్ రికార్డును సృష్టించింది. ఈ చిత్రం హిందీ డబ్బింగ్ వెర్షన్ కు 200 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రం ఇదే కావటం విశేషం. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా, క్యాథరిన్, రకుల్ ప్రీత్ సింగ్, ఆది పినిశెట్టి, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, సాయి కుమార్ ముఖ్య పాత్రల్లో కనిపించారు.
సరైనోడు హిందీ డబ్బింగ్ హక్కులను గోల్డ్ మైన్ టెలిఫిల్మ్స్ సంస్థ దక్కించుకుంది. అల్లు అర్జున్ డబ్బింగ్ సినిమాలకు హిందీలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఇదే సంస్థ దక్కించుకున్న దువ్వాడ జగన్నాథం చిత్రం ఇప్పటికే 175 మిలియన్ల కు పైగా వ్యూస్ సాధించింది. భవిష్యత్తులో ఈ రికార్డును అది బ్రేక్ చేసినా చేయవచ్చు. సన్నాఫ్ సత్యమూర్తి కూడా 78 మిల్లియన్లకు పైగా వ్యూస్ సాధించటం విశేషం. తన డబ్బింగ్ చిత్రాలతో అల్లు అర్జున్ గోల్డ్ మైన్ సంస్థకే గోల్డ్ మైన్ గా మారాడు.
Post a Comment