భారతదేశంలో ముస్లింల జనాభా పెరుగుదల రేటు హిందువుల దాని కంటే ఎక్కువ ఉందని కొంతమంది విద్వేషాన్ని వ్యాపింపజేసే అవకాశం ఉందని, ఎఐఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. వారు వెనుకబడి ఉండటం వలన అలా జరుగుతుందని, కానీ వారిలో కూడా జనాభా పెరుగుదల రేటు విద్య మరియు అవగాహన పెరిగిన చోట తగ్గిందని ఆయన వివరించారు.
అంతేకాకుండా, ముస్లిం జనాభా ఈ రేటుతో పెరుగుతూ ఉండి, హిందూ జనాభా స్థిరంగా ఉంటే కూడా రెండూ సమానం కావటానికి 200 సంవత్సరాలు పడుతుందని, అది సాధ్యమయ్యే విషయం కాదని అని ఆయన తెలిపారు. ఇంకా ముస్లింలు అనేకసార్లు వివాహం చేసుకుంటారని, చాలా మంది పిల్లలను కంటారని, తమ భార్యల నుండి విడాకులు తీసుకున్నారని ఇలా కొంత మంది చేస్తున్న పనులను అందరికీ ఆపాదించి ఉపాధి, విద్య వంటి వాస్తవ సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని ఆయన అన్నారు.
బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తి వైఫల్యం చెందిందని ఆయన ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదం ఓట్లు పొందడానికి లక్ష్యంగా చేస్తున్న ఒక హైటెక్ డ్రామా అని అన్నారు. రెండు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తానన్న హామీని నిలబెట్టుకోలేదని, దేశంలో ఇంధన ధరలు పెరిగిపోతున్నాయని ఆయన అన్నారు. సర్జికల్ దాడులు చేసామని ఛాతీ విరుచుకున్నారు. కానీ ఆ తర్వాత కాశ్మీర్లో హింస మరింతగా పెరిగి మన జవాన్లు తమ ప్రాణాలను కోల్పోతున్నారు అని విమర్శించారు.
ఎన్నికలు దగ్గరకు వస్తుండటం, వారు చేసిందేమీ లేకపోవటంతో, హిందుత్వ పేరుతో కల్లోలాలు సృష్టించటం, అయోధ్య, శ్రీలంకకు రామాయణ ఎక్స్ ప్రెస్ అంటూ మళ్ళీ మొదలు పెడుతున్నారని ఒవైసి వ్యాఖ్యానించారు.
Post a Comment