సచిన్ కు కూడా రైల్వే జోన్ కావాలంట

సచిన్ కు కూడా రైల్వే జోన్ కావాలంట
మనదేశంలో కొత్త రైల్వే జోన్లు, డివిజన్లు కావాలనే డిమాండ్లు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి. వీటిలో చాలా వరకూ రాజకీయపరమైన డిమాండ్లే. ఇప్పటివరకు గత మూడు సంవత్సరాలలో 174 మంది ప్రముఖులు కొత్త రైల్వే జోన్ గానీ,  డివిజన్ గానీ కావాలని అడిగారు. వీరిలో 55 మంది కొత్త రైల్వే జోన్ కావాలని అడగగా,  119 మంది డివిజన్ కావాలని అడిగారు. సచిన్ టెండూల్కర్, శశి థరూర్,  నితిన్ గడ్కరి మరియు యోగి ఆదిత్యనాథ్ ఇలా డిమాండ్ చేసిన వారిలో ఉన్నారు. సచిన్ ముంబయి సబర్బన్ జోన్ కోసం అడుగగా, గడ్కరీ నాగపూర్ జోన్ కోసం అడిగారు. 

ఇప్పటివరకు దేశంలో మొత్తం 17 జోన్లు, 73 డివిజన్లు ఉన్నాయి. రైల్వే శాఖ ఇన్ని అవసరం లేదని, వీటి వల్ల ఖర్చు పెరిగిపోతుందని భావిస్తుంది.  2002 నుండి ఏర్పాటు చేసిన వాటిలో అత్యధికం రాజకీయ కారణాలతో ఏర్పాటు చేసినవేనని రైల్వే శాఖ తెలిపింది. 

0/Post a Comment/Comments

Previous Post Next Post