కేంద్రం ఈ మధ్య విడుదల చేసిన వివరాల ప్రకారం మనదేశంలో 19500 కన్నా ఎక్కువ మాతృభాషలు ఉన్నాయి. అయితే దేశంలో 96% కన్నా ఎక్కువ జనాభా 22 షెడ్యూల్డ్ భాషలనే మాతృభాషలుగా కలిగి ఉన్నారు. దేశంలో 10 వేల కన్నా తక్కువ మంది తమకు మాతృ భాషంటూ లేదని కూడా తెలపడం గమనార్హం.
అయితే పది వేల మంది కన్నా ఎక్కువ మంది మాట్లాడే భాషలు 121 మాత్రమే. ఈ 121 లో 22 షెడ్యూల్డ్ భాషలు, కాగా 99 అన్ షెడ్యూల్డ్ భాషలు. ఇన్ని భాషలున్నప్పటికీ దేశం మొత్తం మీద 270 భాషలు మాత్రమే భవిషత్తులో నిలిచి ఉండే అవకాశముందట. మిగిలినవి ఇప్పటికే అంతరించి పోయే దశకు చేరుకున్నాయట.
Post a Comment