బ్రిటిష్ రక్షణ శాఖా మంత్రి గవిన్ విలియమ్సన్, భారత రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ తో జరగవలసిన ద్వైపాక్షిక సమావేశాన్ని తిరస్కరించారని అక్కడి పత్రికల్లో వార్తలు రావటంతో దుమారం చెలరేగింది.
జూన్ 20–22 తేదీల్లో లండన్‌లో ఇరు దేశాల రక్షణ మంత్రుల మధ్య ద్వైపాక్షిక సమావేశాన్ని భారత అధికారులు ప్రతిపాదించగా షెడ్యూలింగ్ కారణాల వల్ల కుదరదని, జులైలో ఏర్పాటు చేయాలని బ్రిటీష్ అధికారులు సూచించటం తో ఈ వివాదం ప్రారంభమైంది. ఆ సమయంలో రెండు దేశాల మధ్య లండన్ లో ద్వైపాక్షిక సహకార సమావేశం జరుగుతుండటంతో రెండూ కలసి వస్తాయని సీతారామన్ భావించారు. సమావేశం కుదరక పోవటంతో ఆవిడ, తన పర్యటనను రద్దు చేసుకున్నారు. అసలు ఫిబ్రవరి లోనే ఈ సమావేశం జరగవలసింది. కానీ అప్పుడు మన దేశం వాయిదాను ప్రతిపాదించింది.
బ్రెక్సిట్ నేపథ్యంలో భారత దేశం, బ్రిటన్ కు చాలా ముఖ్యమైన భాగస్వామి అని, ఇలా చేయడం ఎంతమాత్రం తగదని, రక్షణ మంత్రి గవిన్ విలియమ్సన్, విదేశాంగ కార్యదర్శి బోరిస్ జాన్సన్ లపై విమర్శకులు దుమ్మెత్తిపోస్తున్నారు.
Post a Comment