రైతు బంధు చెక్కులు ముద్రించి 90 రోజులు దాటిపోతుండటంతో వాటి చెల్లుబాటు గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఇంకా పంపిణీ కావలసిన చెక్కులు భారీగా ఉండటం, రైతులకు పంపిణీ చేసిన చెక్కుల్లో కూడా కొన్ని బ్యాంకుల్లో జమ కాకపోవటంతో తదుపరి కార్యాచరణపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు.
ఇప్పటివరకు ప్రభుత్వం మొత్తం 49.72 లక్షల చెక్కులను ముద్రించగా, ఇంకా అధికారుల వద్ద పంపిణీ కాకుండా మిగిలి ఉన్న చెక్కులు 9.08 లక్షలు ఉన్నాయి. రైతులకు పంపిణీ చేసిన చెక్కుల్లో కూడా దాదాపు 2 లక్షల చెక్కులు ఇప్పటికీ వారు బ్యాంకులో జమ చేయలేదు. అధికారుల వద్ద మిగిలి ఉన్న చెక్కులలో 3 లక్షల మంది భూ యజమానులు విదేశాల్లో ఉండగా, మిగిలినవి యజమానులు ముందుకు రానివి, వాజ్యాలలో ఉన్నవి ఉన్నాయి.
చెక్కుల గడువు పెంపుకు బ్యాంకులను అంగీకరింప చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వారు ఒప్పుకోకపోతే మళ్ళీ ముద్రించవలసి ఉంటుంది.
Post a Comment