విజయ తీరాల దిశగా ఇమ్రాన్

విజయ తీరాల దిశగా ఇమ్రాన్
రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందిన పాకిస్తాన్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ కు చెందిన పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఎ ఇన్సాఫ్‌ (PTI) విజయం దిశగా పయనిస్తోంది. అతని ప్రత్యర్థి, ప్రస్తుతం జైలులో ఉన్న నవాజ్ షరీఫ్ ఈ ఎన్నికలు జరిగిన తీరును తీవ్రంగా విమర్శించారు. 

ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అవసరమైన మెజారిటీ స్థానాలు  వచ్చేలా కనిపించటం లేదు. అయినప్పటికీ ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలననే నమ్మకంతో ఉన్నాడు. కడపటి వార్తలందే సమయానికి (ఉదయం 5 గంటలకు), పిటిఐ పార్టీ 112 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, 64 స్థానాల్లో నవాజ్ షరీఫ్ కు చెందిన పిఎంఎల్, 42 స్థానాల్లో బిలావల్ భుట్టోకు చెందిన పిపిపి ఆధిక్యంలో ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి కావలసిన మేజిక్ ఫిగర్ 137. పూర్తి ఫలితాలు వెల్లడవటానికి మరికొన్ని గంటల సమయం పట్టేలా ఉంది. 

పిటిఐ పార్టీ అధికార ప్రతినిధి ఫవాద్ చౌదరీ, ప్రారంభ అంచనాలు సానుకూలంగా ఉండటం పట్ల హర్షం వ్యక్తం చేసారు. "కొత్త  పాకిస్తాన్ దేశానికి అభినందనలు! మన ప్రధాన మంత్రి ఇమ్రాన్ మిస్టర్ ఖాన్ ". అని ఆయన ట్వీట్ కూడా చేసారు. 

కాగా నవాజ్ సోదరుడు షాబాజ్ ఎన్నికల కౌంటింగ్ ను బహిష్కరించారు. భారీ స్థాయిలో ఇమ్రాన్ కు అనుకూలంగా రిగ్గింగ్ జరిపారని ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే , 71 ఏళ్ల పాకిస్తాన్ రాజకీయ చరిత్రలో పౌరులు ఎన్నుకున్న ప్రభుత్వం నుండి మరో పౌరులు ఎన్నుకున్న ప్రభుత్వానికి అధికారం బదిలీ కావటం, ఇది కేవలం రెండవ సారి మాత్రమే అవనుంది. 

0/Post a Comment/Comments

Previous Post Next Post