తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట వద్ద సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అయిదుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటోను  లారీ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. 

పెద్దాపురం మండలం వడ్లమూరులో జరిగిన ఓ వివాహ శుభకార్యానికి హాజరై ఆటోలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం  జరిగింది. ఆ సమయంలో ఆటోలో 15 మంది ప్రయాణిస్తున్నారు. డ్రైవర్ తప్ప మిగిలిన మృతులంతా కాకినాడ మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన వారు.  చనిపోయినవారిని సాలాది నాగమణి(35), నొక్కు కమలమ్మ(35), పండు(3), ఇంద్ర పాలేనికి చెందిన ఆటోడ్రైవర్‌ పెంకె రాజు(50)  గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post