మాకు ఒక్క అవకాశం ఇవ్వండి - పవన్

తమకు ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ఒక సారి ఆ అవకాశం ఇస్తే మళ్లీ ఎప్పటికీ ప్రజలు తమనే కోరుకునేలా పరిపాలన అందిస్తామని ఆయన అన్నారు. తెలుగు దేశం ప్రభుత్వం ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేస్తుందని కూడా ఆయన అన్నారు. 

విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఎస్‌.కోటలోని దేవి గుడి జంక్షన్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు.  8 లక్షల ఎకరాలకు నీరిచ్చే బాబూ జగ్జీవన్‌రామ్‌ ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు, కానీ తాత్కాలికమైన పట్టిసీమకు 2 వేల కోట్లు ఇవ్వగలిగారు. ఇలా చేస్తే ప్రాంతీయ అసమానతలు రావా?, అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ఎంపీలంతా కలసి కనీసం ఒక్క కొత్తవలస రైల్వేబ్రిడ్జి సాధించలేకపోయారని దుయ్యబట్టారు. 

బాబు వస్తే జాబు అన్నారని, కానీ ముఖ్యమంత్రి గారి బాబుకే జాబు వచ్చింది తప్ప ఎవ్వరికీ రాలేదని ఎద్దేవా చేశారు. తమకు నిరుద్యోగ భృతికన్నా ఉద్యోగాలు రావడమే ముఖ్యమని కూడా ఆయన అన్నారు. ఉన్న కాంట్రాక్టు ఉద్యోగాలను తెలుగు దేశం ప్రజా ప్రతినిధులు అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post