రేషన్ లొల్లి

రేషన్ లొల్లి
ఎవరైనా అడిగిందే తడవుగా భోళా శంకరుడిలా వరాలు కురిపించే కెసిఆర్, రేషన్ డీలర్ల డిమాండ్ల విషయంలో మాత్రం పట్టుదలగా ఉన్నారు. అటు రేషన్‌ డీలర్లు కూడా రాజీ పడక పోవటం తో సమస్య తీవ్రమైంది. వారు సమ్మె విరమించక పోవటం తో, రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల రేషన్ పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. 

ముఖ్యమంత్రి గారు మొదటి నుండి రేషన్ డీలర్ల పట్ల విముఖం గానే ఉన్నారు. వారి అక్రమాలపై ఆయనకు నిశ్చితాభిప్రాయం ఉంది. ఒకసారి శాసన సభలో కూడా రాష్ట్ర జనాభా కన్నా తెల్ల రేషన్ కార్డు దారుల సంఖ్య ఎక్కువని ఆయన అన్నారు. ఈ-పాస్ అమలు తో ఈ సంఖ్య కొంత తగ్గినా ఇంకా భారీ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయని ఆయన భావిస్తున్నారు.  

రేషన్ కమిషన్ పంపు విషయంలో డీలర్లు ఇప్పటికే ఎన్నో సార్లు సమ్మె చేసేందుకు సిద్ధమయ్యారు.  రాష్ట్ర మంత్రులు మరియు అధికారులు వారిని ఏదో విధంగా ఒప్పించి సమ్మె విరమింప చేసారు. ఈ సారి మాత్రం డీలర్లు పట్టుదలను ప్రదర్శిస్తూ సమ్మెను మొదలుపెట్టగా, ప్రభుత్వం కూడా అంతే పట్టుదలతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. 

2015 నుండి అమల్లోకి వచ్చిన కేంద్ర ఆహార భద్రతా చట్టం ప్రకారం ప్రతి క్వింటాలుకు 70 రూపాయల కమీషన్‌ ఇవ్వాలి. దీనిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం క్వింటాలు కు 20 రూపాయలు మాత్రమే చెల్లిస్తోంది. దీనిని 70 కి పెంచాలని డీలర్ల డిమాండ్. ఈ విషయమై ముఖ్యమంత్రిని ఒప్పించేందుకు వివిధ సందర్భాల్లో మంత్రి ఈటెల రాజేందర్‌  ప్రయత్నించినా సఫలం కాలేదని సమాచారం. 

అధికారంలో ఉన్న ప్రభుత్వం రేషన్ డీలర్లు అక్రమాలు చేస్తుంటే అరికట్టాలి గానీ, న్యాయబద్ధ డిమాండ్లను అంగీకరించక పోవటం ఏమిటో.  

0/Post a Comment/Comments

Previous Post Next Post