నవాజ్‌ షరీఫ్‌కు మరోసారి చుక్కెదురు

నవాజ్‌ షరీఫ్‌కు మరోసారి చుక్కెదురు
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు పాకిస్తాన్ సుప్రీమ్ కోర్టులో మరోసారి చుక్కెదురైంది.  దీనితో ఆయన పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ (ఎన్‌)  పార్టీ అధ్యక్ష్య పదవి తో పాటు, పార్టీ పేరులోని ఎన్ అక్షరం కూడా   కోల్పోనున్నారు.  

ఎన్నికలలో అనర్హతకు గురైన వ్యక్తి పేరుపై రాజకీయ పార్టీ ఉండరాదంటూ, అవామీ తెహ్రిక్‌ పార్టీ నేత  దాఖలు చేసిన పిటిషన్ పై స్పందిస్తూ కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. ఈ నెల 9న కోర్టులో హాజరు కావాలని సమన్లు కూడా పంపింది. పాకిస్తాన్ రాజ్యంగంలోని ఆర్టికల్‌ 62, 63 ప్రకారం అటువంటి వ్యక్తి పార్టీ అధ్యక్షునిగా కొనసాగలేరంటూ సుప్రీం కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. 

0/Post a Comment/Comments

Previous Post Next Post