డప్పు కళాకారులకు 1500 పింఛను

డప్పు కళాకారులకు 1500 పింఛను
నెల్లూరులో దళిత తేజం తెలుగుదేశం ముగింపు కార్యక్రమం సందర్భంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తూ దళితుల  సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఇక నుండి డప్పు కళాకారులకు నెలకు 1500 రూపాయల పింఛను ఇస్తామని, క్రైస్తవుల రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తామని సీఎం ప్రకటించారు. అలాగే త్వరలో అమరావతిలో దళిత పార్లమెంట్‌ను  నిర్వహించనున్నామని కూడా తెలియజేసారు. తమ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఎస్సీ కాలనీల నుంచే ప్రారంభం అవుతాయని ఆయన అన్నారు. 

ఈ సభలో ముఖ్యమంత్రి దళితుల కోసం తమ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను కూడా వివరించారు. అన్ని గ్రామాల్లో సిమెంట్‌ రోడ్లు, ఎల్‌ఈడీ బల్బులు, పేదలందరికీ మరుగుదొడ్లు,  ఇళ్ళు కట్టిస్తున్నామని తెలిపారు. ఎస్సీ పిల్లలకు ప్రత్యేక పౌష్టిహాకారం అందిస్తున్నామని, నెలకు 75 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నామని ఆయన వివరించారు. ఇప్పటికే తమ ప్రభుత్వం వచ్చిన నాలుగేళ్లలో 40వేల కోట్ల రూపాయలు ఎస్సీల కోసం ఖర్చు పెట్టామని అన్నారు. 

తెలుగు దేశం పార్టీ దళిత తేజం - తెలుగుదేశం కార్యక్రమాన్ని ఈ సంవత్సరం జనవరి 26న ప్రారంభించింది. దీనిలో భాగంగా 83 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో పార్టీ తరపున కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమ ముగింపు సందర్భంగా నెల్లూరులో ఈ సభ నిర్వహించారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post