హిందీలో ఇరగదీసిన తెలుగు దేశం ఎంపీ

తెలుగు దేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు పార్లమెంట్లో అవిశ్వాసం సందర్భంగా హిందీలో అనర్ఘళంగా ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎంపీలకు హిందీ సరిగా రాదు, ఎవరూ తడబడకుండా మాట్లాడలేరనే భావన ఉంది. కానీ రామ్మోహన్ నాయుడు, బిజెపి ఎంపీ హరిబాబును ఏకి పడేస్తూ అద్భుతంగా మాట్లాడారు. 

నాలుగు సంవత్సరాలయినా కేంద్రం ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌లపై స్పందించడం లేదని, పెట్రో కెమికల్ కాంప్లెక్స్, విశాఖ ఇండస్ట్రియల్ కారిడార్ లాంటి వాటిపై ఎటువంటి ప్రగతి లేదని అన్నారు. అన్నీ ఇచ్చామని హరిబాబు చేసిన వ్యాఖ్యలపై విరుచుకపడ్డారు. మీరేం ఇచ్చారు, మేమేం తీసుకున్నాం. మా ప్రజలకు నమ్మకం పోతోంది. మేమెక్కడికి వెళ్ళాలి. ఒక ప్రధాని ఇచ్చిన హామీలను మరొక ప్రధాని గౌరవించరా? అని ప్రశ్నించారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post